calender_icon.png 30 April, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందాల పోటీలకు నిఘా నీడ

30-04-2025 12:21:41 AM

  1. కట్టుదిట్టమైన భద్రతకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
  2. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): హైదరాబాద్ వేదికగా మే 10న ప్రారంభమయ్యే మిస్ వరల్డ్- 2025 పోటీలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన ఏర్పా ట్ల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న వా రికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎయిర్‌పో ర్టు, అతిథులు బస చేసే హోటళ్ సహా పోటీ లు జరిగే ప్రదేశంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

అలాగే, అతిథులు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అందాల పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విభాగాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు.  నగరంలో పెండింగ్‌లో ఉన్న బ్యూటిఫికేషన్ ప నులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

మిస్ వరల్డ్ - 2025 పోటీలు  పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రణాళికలను సిద్ధం చేయా లని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర పర్యాటక, సాం స్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సం బంధిత ఉన్నతాధికారులతోపాటు పోలీసు ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.