calender_icon.png 1 November, 2024 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై నిఘా

13-07-2024 02:16:45 AM

వేడుకల్లో అక్రమ మద్యం లేకుండా చర్యలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): ఆగస్టు నెలాఖరుకు మత్తు పదార్థాలను నియంత్రించాలనే లక్ష్యంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చర్య లు చేపట్టారు. దానికి తోడు నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం వినియోగంపైనా ప్రత్యేక నజర్ పెడుతున్నారు. హైదరాబాద్, మేడ్చ ల్, మల్కాజిగిరి సహా పలు జిల్లాల్లో ఫాం హౌజ్‌లు, ఫంక్షన్‌హాళ్లలో జరుగుతున్న వివి ధ రకాల వేడుకల్లో విచ్చలవిడిగా మద్యాన్ని వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.

నామమాత్రం అనుమతులు తీసుకుంటున్నప్పటికీ ఆయా వేడుకల్లో నిర్వాహకులు ఎక్సైజ్ అధికారులను బురిడీ కొట్టించి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఎక్సైజ్ అధికారులు నగరంతో పాటు శివారు ప్రాంతాలు, ఫంక్షన్‌హాళ్లు, ఫాంహౌస్‌ల్లో జరుగుతున్న వేడుకలపై దృష్టి పెడుతున్నారు. 

అక్రమ మద్యం లభిస్తే బ్లాక్ లిస్ట్‌లోకి ఫంక్షన్ హాల్

వేడుకల్లో మద్యం వినియోగించాలంటే ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి పొందినప్పటికీ ఆయా వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన మద్యాన్నే వినియోగించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరగడంతో పాటు తెలంగాణ మద్యం వినియో గం కూడా పెరుగుతోంది. అయితే పలువురు నిర్వాహకులు పేరుకు అనుమతులు తీసుకుంటున్నప్పటికీ ఆయా దావత్‌లలో తెలంగాణ మద్యాన్ని ఉపయోగించడంతో పాటు నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తెలంగాణ మద్యం కన్నా తక్కువ ధరకు నాన్‌డ్యూటీ పెయిడ్ లభిస్తుండడంతో పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యంపై నిషేదం ఉన్నందున ఫంక్షన్‌హాళ్లలో పార్టీల్లో వినియోగిస్తే ఆ హాల్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను సరఫరా చేస్తున్న 165మందిపై కేసులు నమోదు చేశారు. 35వాహనాలు సీజ్ చేశా రు. రూ.61.13లక్షల మద్యాన్ని సీజ్ చేశారు. 

శ్రావణమాసంలో శుభకార్యాలపై నజర్

శ్రావణమాసం రాబోతున్నందున శుభకార్యాలు పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భం గా హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో జరుగబోయే వేడుకల కోసం మద్యం అనుమతి తీసుకున్న ఈవెంట్లపై దృష్టి సారించడానికి ఎక్సైజ్ అధికారులు సిద్ధమవుతున్నారు. రెండు నెలల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని నివారించాలని, వినియోగించే వారిపై కఠినమైన కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి కమలాసన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

కాగా 2023 సంవత్సరంలో హైదరాబాద్ డివిజన్ పరిధిలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 4,729 వేడుకలకు ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. సరూర్‌నగర్‌లో 2,990, మేడ్చల్‌లో 1,873, మల్కాజ్ గిరిలో 1,522, హైదరాబాద్‌లో 790 వేడుకలు జరిగాయి.

వేడుకలపై నిఘా ఉంచుతాం

మద్యం అనుమతులు తీసుకున్న ఫంక్ష న్లపై ప్రత్యే నిఘా ఉం చుతాం. ఈవెంట్లలో నాన్‌డ్యూటీపెయిడ్ లిక్కర్‌ను వినియోగిస్తే ఉపేక్షించేది లేదు. వేడుక నిర్వాహకులు, ఫంక్షన్‌హాల్ యజమాని, మద్యం సరఫరాదారులందరిపై కేసులు నమోదు చేస్తాం.

 వీబీ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్