మంజులకు రివార్డు చెక్కు అందజేస్తున్న సీపీ అంబర్ కిశోర్‌ఝా
- మూడు దశాబ్దాలుగా పీపుల్స్‌వార్‌లో కీలకపాత్ర
- రూ.20 లక్షల రివార్డు చెక్కు అందజేసిన సీపీ
జనగామ, నవంబర్ 14 (విజయక్రాంతి): మూడు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీ పీపుల్స్‌వార్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన మహిళా మావోయిస్తు గురువారం పోలీసు ల ఎదుట లొంగిపోయింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన కోడి మంజుల అలియా స్ నిర్మల 1994లో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ దళంలో చేరారు. 2002లో పోలీసు లకు పట్టుబడి రెండేళ్ల పాటు జైలు జీవితం అనుభవించారు.
తిరిగి 2004లో దళంలో చేరి డిప్యూటీ కమాండర్, దండకారణ్య స్పెష ల్ జోనల్ కమిటీ ఏరియా కార్యదర్శి, దర్బా డివిజన్ కమిటీ మెంబర్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. 2013లో దర్బా డివిజన్ పరిధిలో 27 మంది పోలీసులను మావోయిస్టులు హతమార్చిన ఘట నలో ఈమె పాల్గొన్నారు.
అనారోగ్య సమస్యలు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాల కారణంగా ఆమె దళా న్ని వీడి లొంగిపోయినట్లు వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. తన కార్యాలయంలో ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల రివార్డు చెక్కును అందజేశారు.