జనగామ/ములుగు, డిసెంబర్ 25(విజయక్రాంతి): సీపీఐ మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్న అలువ స్వర్ణ అలియాస్ స్వర్ణక్క బుధవారం ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఆమె ఏరియా కమిటీ జనతన సర్కార్ అధ్యక్షురాలిగా రెండేళ్లు పనిచేశారు. మావోయిస్టు సిద్ధాంతాలు ప్రస్తుత సమాజానికి పనికిరావని, అందుకే జన జీవన స్రవంతిలో కలిసినట్టు ఆమె తెలిపారు.