calender_icon.png 19 January, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22 మంది మావోయిస్టుల లొంగుబాటు

19-01-2025 12:20:00 AM

భధ్రాద్రి కొత్తగూడెం, జనవరి 18 (విజయక్రాంతి)/చర్ల: చతీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ఎర్రపల్లి ఆర్‌పీసీకి చెందిన 22 మంది మావోయిస్టులు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా చర్ల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నక్సలైట్లు, వారి కుటుంభ సభ్యులతో ఎస్పీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

లొంగిపోయిన మావోయిస్టులకు పోలీస్‌శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆరపేషన్ పంకజ్ పరితోష్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంతి కుమార్‌సింగ్, చర్ల సీఐ రాజువర్మ, దుమ్ముగూడెం సీఐ అశోక్, ఎస్సై నర్సిరెడ్డి పాల్గొన్నారు.