calender_icon.png 13 December, 2024 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగొట్టుకున్న ఆభరణాల అప్పగింత

13-12-2024 02:30:45 AM

కరీంనగర్, డిసెంబరు 12 (విజయక్రాంతి): ఆటోలో ఆభరణాలు పోగొట్టుకున్న బాధితురాలికి కరీంనగర్ పోలీసులు తిరిగి వాటిని అప్పగించారు. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన మామిడిపల్లి హేమశ్రీ బుధవారం భర్త గణేశ్‌తో కలిసి బుధవారం కరీంనగర్‌లో జరిగిన ఓ శుభకార్యానికి విచ్చేశారు. వేడుక తర్వాత దంప తులు జగిత్యాల వెళ్లేందుకు ఆటోలో బస్టాండ్‌కు చేరుకున్నారు. బస్టాండ్ వద్ద హడావు డిలో దంపతులు ఆటోలో బ్యాగ్ మరచిపోయారు. అనంతరం ఆటో అక్కడినుంచి వెళ్లి పోయింది.

కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ లేదని గుర్తించిన హేమశ్రీ కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించింది. బ్యాగులో 10 తులాల బంగారం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నది. ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ వెంటనే స్పందించి సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోను గుర్తించా రు. డ్రైవర్ నుంచి నగలతో కూడిన బ్యాగు ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ మేరకు బాధితురాలిని పోలీస్‌స్టేషన్‌కు రప్పించి డీసీపీ చేతులమీదుగా ఆభరణాలు అప్పగించారు.