calender_icon.png 1 April, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోత్కూరు, ఆత్మకూర్ తాసీల్దార్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

26-03-2025 01:44:45 AM

  • ఇందిరమ్మ ఇళ్లలో నాణ్యత లోపిస్తే బాధ్యులపై చర్యలు
  • కలెక్టర్ ఎం హన్మంతరావు 

యాదాద్రి భువనగిరి మార్చి 25 ( విజయ క్రాంతి ): జిల్లాలో ముఖ్యంగా తాసిల్దార్ కార్యాలయాలు ప్రజలకు అందిస్తున్న సేవలు ఏ మేరకు  ఉంటున్నాయి. అందిస్తున్న సేవలతో ప్రజలు సంతృప్తి ఉన్నారా లేక ఇబ్బందులు గురవుతున్నారా అనే విషయంపై క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నారు.

అందులో భాగంగా ఆత్మకూర్ ఎం, మోత్కూరు తాసిల్దార్ కార్యాలయాలను అకస్మికంగా తనిఖీలు నిర్వహించి మోత్కూరు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ తో సమీక్ష నిర్వహించారు. ధరణి పై అధికారులతో సమావేశమై ప్రజలు అందిస్తున్న సేవలపై చర్చించారు. ధరణి లో తప్పుడు రిపోర్ట్ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మండల సర్వేయర్ల వద్ద సర్వే కోసం ఉన్న దరఖాస్తులను, మీసేవ దరఖాస్తులను, రేషన్ కార్డుల దరఖాస్తులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని. మున్సిపాలిటీలలో ఎల్‌ఆర్‌ఎస్ ను వేగావంతం చేయాలని విజయవంతం కావడానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.

ఆత్మకూరు మండలం లో 557 రేషన్ కార్డులు ఉండగా 1450 యూనిట్స్ ఉన్న నేపథ్యంలో ఎంపైర్ చేయాలని ఆదేశించారు. సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని, రిజిస్ట్రేషన్కు వచ్చే రైతులతో గౌరవంగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడానికి  కృషి చేయాలి అన్నారు.

కోర్టు రిజిస్టర్ను పరిశీలించి తన సూచనలు చేశారు. కుల ధ్రువీకరణ, షాదీ ముబారక్ వంటి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆయా మండలాల ఎమ్మార్వోలు ఇతర అధికారులు మున్సిపల్ కమిషనర్ ఎంపీడీవోలు పాల్గొన్నారు.