calender_icon.png 5 March, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్ల ఇసుక రీచ్‌ల ఆకస్మిక తనిఖీ

05-03-2025 12:47:28 AM

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 4 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుండి గోదావరి నదిపై పడవ ప్రయాణం  ద్వారా  చర్లకు ప్రయాణించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. మంగళవారం మణుగూరు పర్యటన అనంతరం కలెక్టర్ గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి, మణుగూరు ,మల్లేపల్లి నుండి పడవ ద్వారా  చర్ల మండలం పెద్దిపల్లి కు ప్రయాణించారు. అనంతరం చర్లలో వీరాపురం, మొగళ్ళపల్లి, చింతకుంట ఇసుకరీచులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రీచ్ లలో రెవెన్యూ, మైనింగ్ ,టిఎస్‌ఎండి లు ఇసుక రవాణా ద్వారా వచ్చే రెవెన్యూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, రెవెన్యూ ను పెంచాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇసుక  రీచుల్లో నిల్వ ఉన్న ఇసుక స్టాక్ నిల్వలను పరిశీలించారు. ఇసుక  రీచుల్లో స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. సొసైటీలు ఇసుక రవాణా ద్వారా రెవెన్యూ చేకూర్చాలని సూచించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట చర్ల తాసిల్దార్ శ్రీనివాస్ , మైనింగ్ శాఖ అధికారి దినేష్  , సొసైటీ సభ్యులు  సంబంధిత అధికారులు పాల్గొన్నారు