29-03-2025 01:30:50 AM
మహబూబాబాద్, మార్చి 28 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలోని దామరవంచ గ్రామంలోని తెలంగాణ గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ బాయ్స్ వసతిగృహాన్ని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని పరిసరాలను పరిశీలించారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పక్కాగా డైట్ మెనూ పాటించాలని, షెడ్యూల్ ప్రకారం పిల్లలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించాలని, ప్రతి సబ్జెక్టులో అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, రాత్రి సమయాలలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, ప్రస్తుత ఎండాకాలం దృశ్య కావాల్సిన సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అన్నారు. వసతి గృహంలో ఏమైనా మైనర్ రిపేర్ ఉంటే వెంటనే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ వెంట కాలేజీ ప్రిన్సిపల్ హేమంత్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ విస్తరణ అధికారి సంబంధిత సిబ్బంది ఉన్నారు.