12-03-2025 12:48:17 AM
మెనూ లిస్ట్ చూపించేందుకు తడబడిన ప్రిన్సిపాల్
తిమ్మాపూర్, మార్చి 11 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం పిల్లలు భోజనం చేస్తున్న డైనింగ్ హాల్ ను పరిశీలించారు. పలువురు విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పాఠశాల, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాలని ఆదేశాలిస్తున్నప్పటికీ ఎంజేపీలు మాత్రం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ప్రతిరోజు పెడుతున్న మెనూ లిస్ట్ అడిగినప్పటికీ ప్రిన్సిపాల్ సరిత నుంచి ఎలాంటి సమాధానం సరైన పత్రాలను అందించకపోవడంతో ప్రిన్సిపాల్ పై సీరియస్ అయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన భోజనం అందించకుండా ధనార్ధనే ధ్యేయంగా నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాఠశాలలో తమకు ఉన్నటువంటి సమస్యలపై అడిగి తెలుసుకొన్నారు. సంబంధిత టీచర్లపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఫొటోస్ ఐడి కార్డు అందించడంలో కూడా వారి వద్ద నుంచి అధికంగా డబ్బులు తీసుకొని కక్కుర్తి పడడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో వాష్ రూమ్స్ అరకొర క్లీన్ ఉన్నప్పటికీ బూజు పాతర నెలకొనడంతో ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతినిత్యం అందిస్తున్న మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా భోజనంలో మెను ఏం పాటిస్తున్నారని ఆరా తీసి పరిశీలించారు. కమిషనర్ చైర్పర్సన్ విద్యార్థులకు కలుగుతున్న సమస్యలపై పాఠశాల టీచర్ల ను నిలదీయడంతో వారి నుంచి పొంతనలేని సమాధానాలు రావడంతో స్టాఫ్ పై సీరియస్ అయ్యారు తమ ఇళ్లల్లో ఇలాగే వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు.
విద్యార్థులకు బెడ్ షీట్స్ పంపిణీ
మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదా ఆకస్మిక తనిఖీ చేయడంతో ఎక్కడ పిల్లలు తమకు బెడ్ షీట్స్ ఇవ్వలేదని చెప్తారో నని విద్యార్థులందరికీ బెడ్ షీట్లను పంపిణీ చేయడం తీరుపై అగ్రికల్చర్ స్టాప్ పై సీరియస్ అయ్యారు. ఇన్ని రోజులు పిల్లలకు ఎందుకు ఇవ్వలేదని ఇప్పుడే ఎందుకు ఇచ్చారని వార్నింగ్ ఇచ్చారు. టీచర్లు మెంటేన్ చేస్తున్న రిజిస్టర్ ను తనిఖీ చేసి ఎన్ని బెడ్ షీట్స్ వచ్చాయి ఎంత స్టాక్ ఉందని పరిశీలించారు.
ఆడపిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మండిపడ్డారు. మధ్యాహ్నం భోజనం విద్యార్థులతో కలిసి రుచి చూసి ముచ్చటించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో తమ ఇళ్లలో ఇలాగే తింటారా ప్రభుత్వం అందిస్తున్న మెనూ ఎందుకు అమలు చేయడం లేదని నిర్లక్ష్యం వహిస్తున్న స్టాప్ పై తీవ్రంగా మండిపడ్డారు.
మళ్లీ హాస్టల్‌కు వస్తా.. తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు
తనకు గురుకుల పాఠశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమాచారం రావడంతోనే ఆకస్మిక తనిఖీ చేశానని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన భోజనంలో మెనూ ప్రకారం అందించకుండా ఎలాంటి రికార్డును మెయింటెన్ చేయకపోవడం అలసత్వం వహిస్తున్న ప్రిన్సిపాల్ పై సీరియస్ అయ్యారు. చేతకాకుంటే రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ 15 రోజుల్లో వస్తానని అప్పుడు ఇదే ధోరణి ఎవరు ఇచ్చినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
వార్డెన్ పై ఆగ్రహం
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో వార్డెన్ వ్యవహరిస్తున్న నిర్లక్ష్య దొరనిపై తీవ్రంగా మండిపడ్డారు. ఆకస్మిక తనిఖీలు వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే తనని కలిసి ఎక్స్పె్లయిన్ ఇవ్వాలని ఆదేశించారు.