11-03-2025 12:00:00 AM
నితిన్ కథానాయకుడిగా రూపొందిన చి త్రం ‘రాబిన్‌హుడ్’. వెంకి కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మార్చి 28న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చాట్ బస్టర్‌గా నిలిచాయి. తాజాగా థర్డ్ సింగిల్‌ను సైతం రిలీజ్ చేసింది చిత్రబృందం.
ఈ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పట్నుంచీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగీత ప్రియుల అంచనాలకు తగ్గకుండా ఉండటం విశేషం. ‘అది దా సర్ర్పైజ్’ అనే పేరుతో విడుదల చేసిన ఈ పాట అందుకు తగ్గట్టుగా ఉందనడంలో సందేహంలేదు. సంగీతం, సాహిత్యంతో కలగలిసిన ఈ పాటలో కేతికశర్మ తన అందచందాలతో ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా కేతిక.. జాస్మిన్ బ్లౌజ్‌లో మెరిసిపోతూ ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్‌తో పాటకు గ్లామర్ అద్దింది. ‘మెనీ మెనీ డేస్‌కు మామిడిపల్లిలో రాతిరి రైతే తగిలాడే.. పైకే ఎగబడు సమయంలో పంట దిగుబడి రాలేదన్నాడే.. అలిగానే తాన్నడిగానే.. ఆ పంటేదే చూపించాడే..
వరి కాదే మిరపే కాదే చెరుకే కాదే వాడు పెంచిన పంటే గంజాయే...’ అంటూ సాగుతోందీ పాట. ఈ గీత సాహిత్యాన్ని చంద్రబోస్ అందించగా.. నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అన్నట్టూ.. ఈ పాట చివరన నితిన్, శ్రీలీల కలిసి డాన్స్ చేయడమూ సర్‌ప్రైజే!