9 మంది అరెస్ట్, హుక్కా పరికరాలు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి) : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ‘మయామి గ్యాలే కేఫ్’ హుక్కా సెంటర్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. హుక్కా సెంటర్ యజమానితో పాటు అందులో పనిచేస్తున్న 9 మందిని పట్టుకున్నారు. 15 మంది కస్టమర్లను అదుపులోకి తీసుకుని, పలు రకాల హుక్కా పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. హుక్కా సెంటర్ నిర్వహిస్తున్న టోలీచౌకికి చెందిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ (25), మద్దె శ్యాంసుందర్(36), మహ్మద్ అశ్వాక్(35), మహ్మద్ అస్లాం(34), నంద కిషోర్ దాన్(23), మల్య కుమార్ దాన్(25), దీపక్ సాహు(20), అల్తాఫ్ రేజా(25), రాణి కోశ్లా(22)లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 1.02 లక్షల విలువైన 28 హుక్కా ఫ్లేవర్ బాక్స్‌లు 28, 48 హుక్కా పాట్స్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వాటిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.