హాకీ ఇండియా లీగ్
రూర్కెలా: హాకీ ఇండియా లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సూర్మా హాకీ క్లబ్ 4-3 తేడాతో వేదాంత కళింగ లాన్సర్స్ మీద థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. హాఫ్ టైమ్ ముగిసే సరికి 1-2తో వెనుకబడి ఉన్న సూర్మా క్లబ్ సెకండ్ హాఫ్‌లో రెచ్చిపోయింది. ఏకంగా మూడు గోల్స్ సాధించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక మరో మ్యాచ్‌లో తమిళనాడు డ్రాగ్సన్స్ 2-0 తేడాతో యూపీ రుద్రాస్ మీద విజయం సాధించింది.
మొదటి హాఫ్‌లో గోల్సేమీ చేయకున్నా కానీ రెండో హాఫ్‌లో తమిళ్ డ్రాగన్స్ రెండు గోల్స్ సాధించి విజయం సొంతం చేసుకుంది. బెంగాల్ టైగర్స్ ఆడిన మూడింటిలో విజయం సాధించి తొలి స్థానంలో ఉండగా.. వేదాంత కళింగ లాన్సర్స్ మూడు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచారు.