19-04-2025 12:00:00 AM
సూర్య ‘కంగువా’ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఆ తర్వాత సూర్య నుంచి వస్తున్న మరో తాజా సినిమా ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రేక్షకులు ఈ సినిమాలో సూర్యను వైల్డ్‌గానూ, క్లాస్‌లుక్‌లోనూ చూడబోతున్నారు. రెండు విభిన్నమైన షేడ్స్‌లో సూర్య నటిస్తున్నారు. సూర్యకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సూర్య ఇందులో విభిన్న గెటప్స్‌లో సందడి చేశారు. లవ్, యాక్షన్ ప్రధానంగా ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా మే 1న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.