లండన్: టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ పాదానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. దీంతో శార్దూల్ మూడు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవనున్నాడు. బుధవారం లండన్‌లో శార్దూల్ పాదానికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జరీకి సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న శార్దూల్ ‘ఆపరేషన్ విజయవంతం’ అని పోస్టు పెట్టాడు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలోనే శార్దూల్ కాలికి గాయమైంది. గాయాన్ని సైతం లెక్కచేయకుండా దేశవాలీ టోర్నీ ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన శార్దూల్ ముంబైకి 42వ టైటిల్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున శార్దూల్ 9 మ్యాచ్‌లు ఆడాడు. కాగా శార్దూల్ ఠాకూర్ బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో గ్రేడ్ ఉన్న సంగతి తెలిసిందే.