29-03-2025 12:13:20 AM
లేజర్ టెక్నాలజీతో ఆపరేషన్ చేసిన రిమ్స్ వైద్యులు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): 90 ఏండ్ల వృద్దురాలికి ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శస్త్ర చికిత్స నిర్వహించారు. జైనథ్ మండల కేంద్రానికి చెందిన అంకత్ పింటుబాయి కి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో, కుటుంబ సభ్యులు ఇటీవల ఆమె ను రిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఐతే పరీక్షించిన వైద్యులు కిడ్నీలో రాళ్ల కారణంగా ఆమెకు కడుపు నొప్పి వస్తున్నట్టు గుర్తించారు. దింతో శుక్రవారం యూరాలజీ ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో వైద్య బృందం వృద్ధురాలికి ఎలాంటి కోతలు లేకుండా లేజర్ టెక్నాలజీ ఉపయోగించి ఆపరేషన్ చేశారు. కిడ్నీ కి ఎలాంటి నష్టం చేకూరకుండా రాళ్లను తొలగించి, ఆమెకు నొప్పి నుంచి ఉపశమనం కలిగించారు. ప్రస్తుతం పింటుబాయి కోలుకుంటునట్లు రిమ్స్ వైద్యులు తెలిపారు. విజయవంతంగా ఆపరేషన్ చేసి, వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన రిమ్స్ డాక్టర్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు