calender_icon.png 6 January, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురేశ్‌కు రెండు రోజుల పోలీస్ కస్టడీ

03-12-2024 12:46:04 AM

  1. లగచర్ల ఘటనలో ఏ-2గా ఉన్న సురేశ్ 
  2. కొడంగల్ కోర్టు ఉత్తర్వులు

వికారాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): లగచరల్లో అధికారులపై దాడి ఘటనలో ఏ-2గా ఉన్న బోగమోని సురేశ్‌ను రెండురోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ కొడంగల్ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్ల ఘటన తర్వాత వారంరోజుల పాటు పరారీలో ఉన్న సురేశ్.. కొడంగల్ కోర్టులో లొంగిపోయారు.

అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. కలెక్టర్ స్థాయి అధికారులపై జరిగిన దాడిలో సురేశ్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు కస్టడీ కోరుతూ కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు రెండు రోజుల పాటు(మంగళ, బుధవారం) పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. సురేశ్ కస్టడీ తర్వాత లగచర్ల దాడి ఘటనపై మరిన్ని వివరాలు బయటకు రావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.