ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం బేతంపూడి నుంచి టేకులపల్లి వస్తున్న ఎడ్లబండిని, ఇల్లందు నుంచి కొత్తగూడెం వెళ్తున్న ద్విచక్రవాహన చోదకుడు వెనుక నుంచి ఎడ్లబండిని ఢీకొట్టి తీవ్ర గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడు కొత్తగూడెం పట్టణ పరిధిలోని బూడిద గడ్డకు చెందిన షఫీగా గుర్తించారు. అతను మిషన్ భగీరథలో పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న టేకులపల్లి సిఐ తాటిపాముల సురేష్, బోడు ఎస్సై శ్రీకాంత్ లు స్పందించి హుటాహుటిన క్షతగాత్రున్ని 108లో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. సమయానికి గుర్తించి ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.