23-04-2025 07:27:22 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణానికి చెందిన ఫిజికల్ సైన్సు ఉపాధ్యాయుడు సురేష్ బాబు తోటమల్లకు ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలలో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఐఎస్ఓ (ISO) గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళా వేదిక అధ్వర్యంలో మే 10, 11 తేదీలలో అంధ్రప్రదేశ్ లోని ఏలూరు పట్టణంలో నిర్వహించనున్న ప్రపంచ సాహితీ సంబరాలలో పాల్గొనాలని అంతర్జాతీయ ఛైర్మన్, అంధ్రప్రదేశ్ ఉగాది పురష్కార్ అవార్డ్ గ్రహీత డా .కత్తిమండ ప్రతాప్, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షరాలు ఈశ్వరి భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి డా. టి .పార్థసారధి లు ఈ మేరకు ఆహ్వాన పత్రం సురేష్ బాబు, తోటమళ్లకు పంపించారు.
సాహితీ పట్టాభిషేక ఉత్సవములు, ప్రపంచ కవితోత్సవం, సాహిత్య సదస్సులు, కళా ప్రదర్శనలు, పుస్తకావిష్కరణలు ఉంటాయని ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డులు కైవసం చేసుకోనున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. తేగడ హైస్కూల్ లో ఫిజిక్స్ టీచర్ గా పని చేస్తూ ఇప్పటికే వివిధ రంగాలలో పలు అవార్డులు సొంతం చేసుకున్న సురేష్ బాబు కి ప్రపంచ సాహితీ సంబరాలకు అహ్వానం అందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు, తోటమల్ల మట్లాడుతూ... సదస్సులో పాల్గొని తన కవితా గళాన్ని వినిపిస్తానని తనకు ఆహ్వానం పంపిన నిర్వాహకులకు కృతఙ్ఞతలు తెలిపారు.