calender_icon.png 29 December, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురేఖకు మంత్రిగా ఉండే అర్హత లేదు

01-12-2024 01:21:57 AM

  1. ఆధారాలుంటే సీబీఐతో విచారణ చేయించండి 
  2. నిరూపిస్తే ఉరికంబానికైనా సిద్ధం 
  3. బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): మంత్రిగా కొనసాగే అర్హత కొండా సురేఖకు లేదని, తనపై ఆరోపణలుంటే బయటపెట్టాలని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆధారాలుంటే సీబీఐతో విచారించాలని, తప్పు చేశానని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు.

కొండా సురేఖను తెలంగాణ సమాజం తిరస్కరించిందని, సంస్కారం లేకుండా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగా ణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొండా కుటుంబానికి నళిని ప్రభాత్ వరంగల్ నడిరోడ్డులో కౌన్సెలింగ్ ఇచ్చారని గుర్తు చేశారు.  విచారణలో తప్పు చేశానని తేలితే ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నట్లు  వెల్లడించారు.

కేటీఆర్ గురుకులాల బాట పిలుపుతో కాంగ్రెస్‌కు భయం పుట్టిందని, మతిస్థిమితం లేని మం త్రులతో.. విద్యాశాఖపై అవగాహన లేని సీఎం రేవంత్‌రెడ్డి తనపై విమర్శలు చేయిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ర్టంలో గురుకు ల విద్యావ్యవస్థ కుప్పకూలిందన్నారు.  తానూ ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుని ఐపీఎస్ అయ్యానని.. పోలీస్ యూనిఫార్మ్ పక్క న పెట్టి విద్యార్థుల కోసం గురుకులాల సెక్రటరీగా తొమ్మిదేళ్లు పనిచేసినట్లు గుర్తు చేశా రు.

మంత్రి సీతక్క తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారని.. మత్తులో ఉండి కొండా సురేఖ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఫుడ్ పాయిజన్ గురించి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు. వారికి చేతగాకపోతే విద్యాశాఖను బీఆర్‌ఎస్‌కు అప్పగించాలన్నారు.

విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఫుడ్ పాయిజన్‌పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈనెల 7వ తేదీ వరకు బీఆర్‌ఎస్వీ గురుకులాల బాట కార్యక్రమం చేసి.. రిపోర్టును కేటీఆర్‌కు అందజేస్తామని విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు.