16-03-2025 01:57:09 AM
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సంబంధించిన సవరణ బిల్లును రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలుగు వర్సిటీ చట్టానికి సవరణ చేస్తూ ఆ వర్సిటీకి ప్రముఖ కవి, ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టనున్నారు. గత సెప్టెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో యునివర్సిటీకి ఆయన పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.