calender_icon.png 1 February, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురభి డ్రామా వెర్షన్ డైలాగులతో.. తెలుగులో తొలి టాకీ చిత్రం

30-01-2025 12:00:00 AM

‘భక్త ప్రహ్లాద’ 1947, జనవరి ౩౦న విడుదలైన ఓ పౌరాణిక చిత్రం. చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం లో శోభనాచల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడి కథే ఈ సినిమా. ఆ రోజుల్లో సురభి తెలుగు నాటక సమా జం ఉపయోగించిన డ్రామా వెర్షన్ ఆధారంగా ఈ సినిమా డైలాగులను రూపొందించారు.

మొదటి ‘భక్తప్రహ్లాద’ 1932లో విడుదల కాగా, అదే కథ ఆధారంగా మరింత ఆధునిక సాంకేతిక విలువలతో రూపుదిద్దుకున్న రెండో చిత్రంగా పరిగణింపబ డుతోంది. తెలుగులో వచ్చిన మొట్టమొదటి టాకీ సినిమా కూడా ఇదే. దానవ చక్రవర్తి హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. విష్ణువు పేరు వినబడితేనే సహించలేడు.

అలాంటిది అతడికి పుట్టిన కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడవుతాడు. పసిప్రాయం నుంచే విష్ణుభక్తిని అలవర్చుకుంటాడు. ఆ భక్తిని తోటి విద్యార్థులకూ బోధిస్తాడు. అతనిలోని విష్ణుభక్తిని పోగొట్టేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవటంతో కన్నకొడుకునే చంపించాలనుకుంటాడు హిరణ్యకశిపుడు.

విష్ణుమూర్తి కటాక్షం వల్ల ఆ హత్యాయత్నాల నుంచీ రక్షింపబడతాడా బుడతడు. చివరకు తండ్రీ కొడుకుల సంవాదంలో విష్ణువు సర్వాంతర్యామి ఉంటాడు ప్రహ్లాదుడు. ఈ స్తంభంలో ఉంటాడా అని ఒక స్తంభాన్ని గధతో పగలగొడతాడు.

ఆ స్తంభం నుంచి నరసింహావతారంలో బయటికి వచ్చి హిరణ్య కశిపుని సంహరిస్తాడు విష్ణుమూర్తి. వేమూరి గగ్గయ్య, రాజేశ్వరి, నారాయణరావు, జీ వరలక్ష్మి, రామకృష్ణశాస్త్రి, కుంపట్ల, పరిపూర్ణ, కోటేశ్వరరావు, రామారావు తదితరులు ముఖ్య తారాగణంగా తెరకెక్కిందీ సినిమా. మోతీబాబు సంగీతం, హెచ్‌ఆర్ బాబు నేపథ్య సంగీత సారథ్యంలో మొత్తం 27 పాటలు, 13 పద్యాలు భక్తిసాగరంలో ఓలలాడింపజేస్తాయి.