calender_icon.png 1 April, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సక్సెస్‌కి కేరాఫ్‌గా సుప్రియ

23-03-2025 12:00:00 AM

నటులు, నటీమణుల తీరు అందరిదీ ఒకేలా ఉండదు. తమను తాము హైలైట్ చేసుకోవడానికి పీఆర్ టీములను వాడటమో లేదంటే ప్రతి విషయంపైనా విపరీతంగా స్పందించడమో కొందరు చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం సైలెంట్‌గా వస్తారు. అలాంటి వారిలో ఒకరు సుప్రియా పాఠక్.  ‘బజార్’లో అందమైన షబ్నంగా.. ‘ఖిచ్డి’లో హాస్యంతో కూడిన హంసగా.. ‘వేక్ అప్ సిద్’లో సైలెంట్ సరితగా.. మరో సినిమాలో విలన్‌గా ఎన్నో పాత్రలు చేశారు. ఒక నటికి అన్ని పాత్రలూ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. 

సుప్రియా పాఠక్ తన తల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మైనా గుర్జారి’ అనే చిత్రంతో నటనలోకి అడుగు పెట్టింది. తర్వాత దినేష్ ఠాకూర్‌తో కలిసి ‘బివియోం కా మదార్సా’లో నటించింది. ఇది చూసిన జెన్నిఫర్ కెండాల్ తమ హోమ్ ప్రొడక్షన్ ‘కలియుగ్’ కోసం శ్యామ్ బెనగల్‌కు సిఫార్సు చేసింది.

మహాభారతం ఆధా రంగా రూపొందిన చిత్రమిది. ఈ చిత్రంలో సుప్రియా పాఠక్.. సుభద్ర పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకుగానూ ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆ తర్వాత సుప్రియా పాఠక్ ‘విజేత, బజార్, మసూమ్, గాంధీ, మిర్చి మసాలా వంటి ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

అక్కా చెల్లెళ్లు అన్న తర్వాత గొడవలు సర్వసాధారణం. ఒకరు అల్లరిగా.. నిత్యం గొడవలు పడుతుంటే.. మరొకరు మాత్రం సైలెంట్‌గా ఉంటారు. సుప్రియా పాఠక్ సోదరి, బాలీవుడ్ నటి రత్న పాఠక్ షా మొదటి రకం. ఈవిడ సుప్రియకు చెల్లి అవుతుంది. సుప్రియను బాగా టార్చర్ పెట్టేసిం దట. ఆ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

‘ఏది పడితే అది అనేసి బాధపెట్టేదాన్ని. ఇప్పుడది గుర్తు చేసుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. 11 సంవత్సరాల విరామం తరువాత తిరిగి 2005లో ‘సర్కార్’ అనే చిత్రంలో సుప్రియ నటించింది. ఆ తర్వాత దాని సీక్వెల్ సర్కార్ రాజ్‌లోనూ నటించింది. ‘వేక్ అప్ సిద్’ (2009)లో తన కొడుకుతో తరం అంతరాలు లేకుండా తీవ్రంగా ప్రయత్నించే తల్లిగా ఆమె నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కాయి.

2013లో వచ్చిన ‘గోలియోన్ కి రాస్‌లీలా రామ్-లీలా’లో ఆమె కీలక పాత్ర పోషించింది. గతేడాది ‘లవ్ కీ అరేంజ్ మ్యారేజ్’ అనే చిత్రం ద్వారా సుప్రియా పాఠక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులోనూ సుప్రియా నటించింది. ‘అరవింద సమేత వీర రాఘవ’లో జేజీ పాత్రలో నటించింది. ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ తల్లి పాత్రలో నటించింది. 

సుప్రియా పాఠక్ 7 జనవరి 1961లో ముంబైలో జన్మించారు. నటి దినా పాఠక్ చిన్న కుమార్తె సుప్రియ. తల్లి కూడా నటి కావడంతో ఆమెకు చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. 1988లో నటుడు పంకజ్ కుమార్‌ను రెండవ వివాహం చేసుకుంది. 1986లో అంటే ‘అగ్లా మౌసం’ చిత్రీకరణ సమయంలో వీరిద్దరూ కలుసుకున్నారు. పరిచయం కాస్తా స్నేహంగానూ.. ఆపై ప్రేమగానూ మారింది. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.