04-04-2025 01:51:49 AM
గచ్చిబౌలిలో ప్రభుత్వ చర్యలన్నీ నిలిపివేయాలి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంలో ప్రభు త్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న అత్యున్నత న్యాయస్థానం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
400 ఎకరాల భూములపై అధ్యయనానికి నెల రోజుల్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని.. ఈ కమిటీ ఆరునెలల్లో నివేదిక సమర్పించాలని పేర్కొంది. అప్పటివరకు చెట్ల నరికివేతను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
మూడు రోజు ల వ్యవధిలోనే వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మాములు విషయం కాద ని ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు లో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. వరుసగా మూడురోజులు సెలువులు రావడం తో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్దఎత్తున చెట్లను నరికేశారంటూ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు అంది ంది.
ఈ అంశంపై సుప్రీంలో గురువారం విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పం పారు. ఈ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. మీడియా, పత్రికల్లో వచ్చిన కథనాలను సైతం అమికస్ క్యూరీ పరమేశ్వరన్.. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందుం చగా వాటినీ పరిశీలించింది. దీనిని సుమోటో కేసుగా స్వీకరించింది.
‘వందల వాహనాలను మొహరించి మూడురోజులోనే అంత అత్యవసరంగా వంద ఎకరాల్లో చెట్లను నరకాల్సిన అవసరం ఏముంది? ఇంత జరుగుతున్నా సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు? పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నా ఇలా ఎలా చేస్తారు? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఇది చాలా తీవ్రమైన విషయం.. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’ అంటూ పేర్కొంది.
ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, చెట్లు కొట్టే ముందు సీఈసీ అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. పర్యావరణ ప్రభావ సర్టిఫికెట్ తీసుకున్నారా? ఫారెస్ట్ విభాగం నుంచి అనుమతులున్నాయా? అని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికలోని ఫొటోలు చూసి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించింది.
వందల కొద్ది యంత్రాలు మోహరించాల్సిన అగత్యం ఎంటో అర్థం కావడం లేదని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం గతనెల 15న నియమించిన కమిటీలోని అధికారులు సైతం సమాధానం చెప్పాలని హుకుం జారీ చేసింది.
ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులను తొలగించింది.
సుప్రీం ఆదేశాలతో నివేదిక పంపిన హైకోర్టు రిజిస్ట్రార్
కంచ గచ్చిబౌలి 400 ఎకరాల వ్యవహారమై గురువారం ఉదయం అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్ర భుత్వం విక్రయించాలనుకుంటున్న కం చ గచ్చిబౌలి భూములను వెంటనే సందర్శించాలని, మధ్యాహ్నం 3.30లోపు నివే దిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదే శించింది. నివేదిక అందగానే సాయంత్రం 4 గంటలకు విచారణ చేపట్టింది.
వాదన ల సందర్భంగా 30 ఏళ్లుగా ఆ భూమి వి వాదంలో ఉందని ప్రభుత్వ తరఫు న్యా యవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అటవీభూమి అని ఆధారాలు లేవని కో ర్టుకు తెలిపారు. అయినప్పటికీ పర్యావర ణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఉద్ఘాటించింది. మరోసారి ఇరువైపుల వాదన లు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యలు అన్నీ నిలుపదల చేయాలని ఆదేశించింది.