calender_icon.png 2 January, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణపై సుప్రీం తీర్పు చరిత్రాత్మకం

04-08-2024 03:40:42 AM

  1. తీర్పు అధ్యయనానికి న్యాయవాదులతో కమిటీ 
  2. సారాంశాన్ని నివేదిక రూపంలో సీఎంకు అందజేస్తాం
  3. 15 రోజుల్లో మాదిగల మహాసమ్మేళనం..
  4. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చరిత్రాత్మకమైందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. వర్గీకరణతోనే సంబరపడకుండా విద్యా, ఉద్యోగ, రాజకీయ రం గాలలో రాణించడంతో పాటు మాదిగ జాతి ఆర్థిక స్వాంతంత్య్రం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ భవిష్యత్తు కార్యచరణపై మాదిగ మేధావులు, ప్రజాసం ఘాలు, ప్రజాప్రతినిధులు బేగంపేట ప్లాజా హోటల్‌లో శనివారం సమావేశం అయ్యా రు.

సమావేశానికి ప్రొఫెసర్ మల్లేశం అధ్యక్షత వహించగా మంత్రులు, మాజీ మంత్రు లు, ఎమ్మెల్యేలు, మేధావులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిని నియమించి వర్గీకరణకు అనుకూలంగా బలమైన వాదనలు విన్పించినట్టు తెలిపారు. ఈ తీర్పులో డైరెక్షన్ కాకుండా కోర్టు రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. వర్గీకరణ ఉద్యమం కానీ, మాదిగలు కానీ ఎవరికీ వ్యతిరేకం కాద ని స్పష్టం చేశారు. ప్రస్తుతం సుప్రీం తీర్పును ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్ న్యాయవాదులతో క్షుణ్ణంగా అధ్యయనం చేయించి, తీర్పు సారాంశాన్ని ప్రత్యేక నివేదికగా రూపొందించాలన్నారు.

ఈ నివేదిక ఆధారంగానే వర్గీకరణ అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతామన్నారు. సీఎం విదేశాల నుంచి రాగానే ఈ నివేదికను అంద జేస్తామన్నారు. వర్గీకరణ చట్టబద్ధత కోసం అవసరమైతే అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించేలా సీఎంను కోరతామన్నారు. తీర్పు ను అమలు చేసేందుకు పార్టీలకతీతంగా రాజకీయ ఉద్యమాన్ని కొనసాగించాలన్నా రు. ముందుగా ఈ నెల 16 లేదా 17 లేదా 18 తేదీలో మాదిగల మహాసమ్మేళనం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో మాదిగలను గుర్తించింది మాజీ సీఎం ఎన్‌టీఆర్ అని పేర్కొన్నారు.