calender_icon.png 24 October, 2024 | 7:57 PM

సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు

18-09-2024 12:54:58 AM

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం లో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను తొలగించి, ఆ ఆస్తులను పరిరక్షించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలపై సర్వాత్రా చర్చనీయాంశంగా మారుతుంది. ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న నేపథ్యంలో బాధితులు, పలువురు సామాజిక కార్యకర్తలు హైడ్రాకు చట్టబద్దత లేదనే విమర్శలు జోరుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ కూడా హైడ్రా ఎట్టి పరిస్థితుల్లో నోటీసులు ఇవ్వదని, చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పలుమార్లు స్పష్టంచేశారు.

సుప్రీంకోర్టు మంగళవారం ఓ కేసు లో పబ్లిక్ రోడ్లు, వాటర్ బాడీలు, రైల్వే లైన్లలో కూల్చివేతలకు అనుమతి అవసరం లేదని పేర్కొంది. అదే సమయంలో కేసులున్నాయని చెప్తూ నిందితులు, నేరస్థులు తది తర వ్యక్తులకు చెందిన ఆస్తులను, ఇండ్లను కూల్చివేయొద్దని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పునకు సంబంధించిన వార్తల క్లిప్పింగ్‌లను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనా థ్ మంగళవారం పోస్టు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు హైడ్రాకు వర్తించదని పేర్కొన్నా రు. సరస్సులు, నాలాలు, ప్రభుత్వ భూము ల ఆక్రమణలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని.. నిందితులు, నేరస్థులు తదితర వ్యక్తులకు చెందిన వారి ఆస్తులను కూల్చివేయబోదంటూ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశా రు. మంగళవారం వెలువడిన తీర్పు హైడ్రా కు కొండంత బలాన్ని ఇచ్చినట్టుగా పలువురు భావిస్తున్నారు.