calender_icon.png 10 January, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్

07-11-2024 01:14:17 AM

న్యూఢిల్లీ, నవంబర్ 6: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూల్చడమేంటని అధికారులను ప్రశ్నించింది. బాధితుడికి రూ.25లక్షలు నష్ట పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

2019లో రోడ్డు విస్తరణలో భాగంగా మహారాజ్‌గంజ్‌కు చెందిన మనోజ్ తిబ్రేవాల్ ఆకాశ్ అనే వ్యక్తి ఇంటిని ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చేశారు. దీంతో అతడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అధికారుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.