361 ఆర్టికల్ చెల్లుబాటును పరిశీలిస్తామన్న కోర్టు
న్యూఢిల్లీ, జూలై 19: దేశవ్యాప్తంగా రాష్ట్రాల గవర్నర్ల వ్యవస్థ తీవ్ర వివాదాస్పదం అవుతున్న వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకొన్నది. పదవిలో ఉండగా గవర్నర్లపై నేర విచారణ జరుపకుండా రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 చెల్లుబాటుపై విచారణ జరుపాలని నిర్ణయించింది. ఇటీవల బెంగాల్ గవర్నర్‌పై ఓ మహిళ లైంగిదాడి ఆరోపణలు చేయటం, ఆ కేసు సుప్రీంకోర్టుదాకా చేరటంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకొన్నది. 361 ఆర్టికల్‌పై న్యాయ సమీక్ష చేయాలని బాధితురాలు వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.