న్యూఢిల్లీ,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ ప్రవేశిక అంశంపై సోమవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రవేశికలో లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని దాఖాలైన పిటీషన్ పై విచారించింది. రాజ్యంగ పీఠికలో లౌకిక, సామ్యవాద పదాలను 1976లో చేసిన సవరణ 42ను సవాలు చేస్తూ పిటిషనర్లు దాఖలయ్యాయి. ప్రవేశికలో నుంచి ఈ రెండు పదాలను తొలగించాల్సిన అవసరమేంటని పిషనర్ బిజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తదితరులను ప్రశ్నించింది. దీనిపై వాదనాలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను కొట్టివేసింది.