04-04-2025 12:33:01 AM
25 వేల టీచర్ల నియామకాలను రద్దు చేసిన ధర్మాసనం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చేపట్టిన 25 వేల టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ గతంలో కోల్‌కతా హైకో ర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తున్న ట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
టీచర్ల నియామక ప్రక్రియ చట్టవిరుద్ధంగా ఉంద ని కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఎ లాంటి కారణం కనిపించడం లేదని తెలిపింది. ఈ సందర్భంగా మూడు నెలల్లో కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం పోస్టింగ్‌లో ఉన్న దివ్యాంగులను మాత్రం ఉద్యోగంలో కొన సాగేలా సడలింపు ఇచ్చింది.
టీచర్ల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. కోర్టు నిర్ణయా న్ని ఒక ప్రభుత్వంగా మేము అడ్డుకోలేమన్నారు. సరైన అభ్యర్థులతో ౩నెలల్లో నియామకాలు పారదర్శకంగా పూర్తి చేస్తామని తెలిపారు.