calender_icon.png 2 April, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూల్చివేతలు అమానవీయం.. యూపీ సర్కారుపై సుప్రీం సీరియస్

01-04-2025 03:41:26 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడమేంటని సంబంధిత అధికారలను ధర్మసనం ప్రశ్నించింది. ప్రయాగ్ రాజ్ లో జరిగిన కూల్చివేతలపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. యూపీ సర్కారు కూల్చివేతలు అమానవీయం.. చట్టవిరుద్ధమన్న కోర్టు బాధితులకు ఆశ్రయం పొందే హక్కు లేదా..? అని ప్రశ్నించింది. అధిక సంఖ్యలో కూల్చివేతలు జరిగయాని గుర్తుంచిన న్యాయమూర్తులు అభయ్ ఎస్. ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం, దేశంలో రూల్ ఆఫ్ లా అంటూ ఒకటి ఉందని, పౌరుల నివాస భవనాల కూల్చివేత ఫ్యాషన్ కాకూడదని పేర్కొంది. బాధితులకు రూ.10 లక్షల చొప్పున ఆరు వారాల్లో పరిహారం చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం ప్రయాగ్ రాజ్ అభివృద్ధి సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రయాగ్‌రాజ్‌లో తగిన చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూల్చివేత చర్యపై సుప్రీంకోర్టు గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. 2023లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌కు చెందిన భూమి అని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను తప్పుగా కూల్చివేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. న్యాయవాది జుల్ఫికర్ హైదర్, ప్రొఫెసర్ అలీ అహ్మద్, ఇళ్ళు కూల్చివేసిన ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. కూల్చివేతను సవాలు చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని లుకేర్‌గంజ్‌లోని కొన్ని నిర్మాణాలకు సంబంధించి పిటిషనర్లకు మార్చి 6, 2021న నోటీసు అందినట్లు సమాచారం.