calender_icon.png 23 September, 2024 | 12:43 AM

కేజ్రీవాల్​​ పిటిషన్​పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

05-09-2024 06:50:18 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొందున్న అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. సీబీఐ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ గతంలో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మసనం సెప్టెంబర్ 10వ తేదీ వరకు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సీబీఐ తీర్పును తప్పుబట్టారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు నమోదై రెండేళ్ల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిని ఈడీ అధికారులు అరెస్టు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.