న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్‌సీపీ నేత గౌతంరెడ్డి(YSRCP Leader Goutham Reddy)పై నమోదైన హత్యాయత్నం కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ను ఆమోదించిన కోర్టు.. ప్రస్తుతం జరుగుతున్న విచారణకు సహకరించేలా గౌతమ్‌రెడ్డికి కొన్ని షరతులు విధించింది. విచారణ అధికారి సమన్లు పంపినప్పుడల్లా గౌతమ్‌రెడ్డి తప్పనిసరిగా హాజరుకావాలని, విచారణకు పూర్తి సహకారం అందించాలని జస్టిస్ పార్థివాలా(Jamshed Burjor Pardiwala), జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా సాక్షులను బెదిరించవద్దని, సాక్ష్యాలను తారుమారు చేయవద్దని గౌతమ్‌రెడ్డి(Goutham Reddy)ని కోర్టు ఆదేశించింది. 5 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో గౌతమ్ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఆస్తిని సంపాదించేందుకు భూయజమానిని హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP) నేత గౌతంరెడ్డి ఆరోపణలున్నాయి.