01-05-2024 12:05:00 AM
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఈడీకి సుప్రీం కోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను ఇప్పుడు ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ అర్వింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం అత్యున్నత న్యాయ స్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. స్వేచ్ఛ అనేది చాలా చాలా ముఖ్యమైనదని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కేజ్రీవాలను అరెస్టు చేయడానికి కారణాలేం టని ప్రశ్నించింది. శుక్రవారం నాటికి దీనికి సమాధానం చెప్పాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది.