calender_icon.png 5 November, 2024 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూస్‌క్లిక్ ఎడిట‌ర్ విడుద‌ల‌కు సుప్రీం ఆదేశాలు

15-05-2024 12:04:56 PM

న్యూఢిల్లీ:  ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్ర‌భిర్ పుర్‌క‌య‌స్త‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసును విచారణ చేపట్టిన న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం రిమాండ్ కాపీని ఇవ్వాలని పేర్కొంది.  ఆయన అరెస్టును కోర్టు తప్పుబట్టంది. ప్ర‌భిర్ పుర్‌క‌య‌స్త‌ను ఎందుకు అరెస్టు చేశార‌న్న అంశానికి సంబంధించిన విష‌యాల‌ను కోర్టుకు చెప్పలేదని, పంక‌జ్ బ‌న్స‌ల్ కేసు త‌ర‌హాలో అత‌న్ని క‌స్ట‌డీ నుంచి రిలీజ్ చేయాల‌ని ఆదేశిస్తూ రిమాండ్ ఆర్డ‌ర్ చెల్ల‌ద‌ని జ‌స్టిస్ మెహ‌తా వెల్లడించారు. పుర్‌క‌య‌స్తను పోయిన సంవత్సరం అక్టోబ‌ర్ 3న యూఏపీఏ చ‌ట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. చైనా ఏజెండా గురించి క‌థ‌నాలు రాస్తున్న న్యూస్‌క్లిక్ సంస్థ‌కు అక్ర‌మంగా నిధులు వ‌స్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆయనపై ఆరోప‌ణ‌లు చేసింది.