న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ఛైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఇచ్చిన సమన్లపై జూలై 1వ తేదీన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రహించారు.
దీంతో విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్ ఛైర్మన్ ను మార్చాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ ఛైర్మన్ ను మార్చేందుకు రాష్ర ప్రభుత్వం అంగీకారించింది. మధ్యాహ్నాం 2 గంటలకు మరో పేరును వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదు తెలిపారు. విద్యుత్ ఒప్పందాలపై జ్యుడీషియల్ కమిషన్ విచారణను కేసీఆర్ సవాల్ చేశారు.