calender_icon.png 12 February, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటాపై సుప్రీంకు

12-02-2025 01:30:26 AM

  1. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్
  2. తదుపరి విచారణ ఏప్రిల్ 4కు వాయిదా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటాపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్  చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవా య్ ధర్మాసనం మంగళవారం పూర్తిస్థాయి విచారణకు అనుమతించింది.

ఇదే సందర్భంలో పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా చెల్లదంటూ ఇటీవల జస్టి స్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పును దృష్టిలో పెట్టుకుని తమ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

అయితే విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే తాము ముందు విచారణ చేపట్టాలని గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. 

ఏంటీ స్థానికత కోటా వివాదం..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) ప్రకా రం ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ చేసిన వి ద్యార్థులకు పీజీలో స్థానికత కోటాలో సీట్లు కేటాయించాలని దాదాపు 100 మంది విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 371(డి) ప్రకారం ఏపీ, తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా వర్తిస్తుందని తెలంగాణ హైకోర్టు తీ ర్పుఇచ్చింది.   

రాష్ట్ర విభజన తర్వాత ఆర్టికల్ 371(డి) పదేళ్ల పాటు మాత్రమే వర్తింపజేయాలనే నిబంధన ఉందన్న తెలంగాణ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదివిన వారికే స్థానిక కోటా వర్తిస్తుందని తెలం గాణ సర్కార్ వాదించింది.

అయితే ఆర్టికల్ 371(డి) ప్రకారం ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో ఎంబీబీఎస్ చదివినవారు కూడా తెలంగాణలో పీజీ మెడికల్ సీట్ల లో స్థానిక కోటా కింద అర్హులేనంటూ తెలంగాణ హై కోర్టు తీర్పుఇచ్చింది.

ఆర్టికల్ 371 (డి) ఉమ్మడి ఏపీకి వర్తిస్తున్నందువల్ల అందు లో సవరణలు చేసేంత వరకు ఆంధ్రా, రాయలసీమ ల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులూ తెలంగాణలో స్థానిక కోటాకు అర్హులేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు మేరకు తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో సుమారు 200 మంది విద్యార్థులు అడ్మిషన్లకు అర్హత పొందారు. దీంతో హై కోర్టు తీర్పును తెలంగాణ సర్కార్ సుప్రీంలో సవాల్ చేసింది.