calender_icon.png 5 April, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు..

05-04-2025 02:25:41 AM

  • రాయలసీమ లిఫ్టు, బనకచర్ల ప్రాజెక్టులను అడ్డుకుంటాం

విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తోంది..

మా ప్రభుత్వానికి తెలంగాణ నీటిప్రయోజనాలే మిన్న

భారీ నీటిపారుదల శాఖ -మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): రాష్ట్ర నీటి ప్రయోజనాలే తమకు అన్నింటికన్నా మిన్న అని భారీ సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. గోదావరి,కృష్ణానదిపై ఏపీ సర్కారు ప్రతిపాదించిన రాయలసీమఎత్తిపోతల, బనకచర్ల పథకాల నిర్మాణాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు.

ఏపీ సర్కారు ఏకపక్షంగా నిర్మించతలపెట్టిన ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణాలతో రాష్ట్రం లో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులకు ము ప్పు ఏర్పడే ప్రమాదం ఉందని..అందుకే సు ప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ర్ట ప్రభు త్వం నిర్ణయించిందన్నారు.

శుక్రవారం జలసౌధలో నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల స్టాండింగ్‌కౌన్సిల్ సభ్యులతోపాటు అడ్వొకేట్ జనరల్‌తో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి గోదావరి, కృష్ణానదులలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా ను కాపాడేందుకు సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్లు తెలిపారు. 

ఏ అనుమతులు లేకుండానే..

గోదావరి జలాలతో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం వద్ద 200టీఎంసీల నీటిని బొల్లపల్లి రిజర్వాయర్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు మళ్లించను న్నారని, తద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసేందుకు ఏపీ రూట్ మ్యాప్ రూపొందించుకుందని తెలిపారు. కేంద్ర జలవనరుల సంఘం, జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ,అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు పొందకుండానే ఏపీ ప్రాజెక్టుల నిర్మా ణాలను చేపట్టిందని విమర్శించారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 46(2), 46(3) ఆధారంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు పొం దేందుకు ఏపీ సర్కారు ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే తాము కృష్ణానది ప్రాజెక్టు ల్లో ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మంత్రి గుర్తుచేశారు.

ఇందుకు స్పందించిన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖలకు చెందిన నిపుణుల కమిటీ ఫిబ్రవరిలో రాయలసీమ ప్రాజెక్టును ముందున్నస్థితికి తీసుకురావాలని ఆదేశించారని చెప్పారు. పర్యావరణ నిబంధనలను ఏపీ సర్కారు ఉల్లంఘనలకు పాల్పడుతోందని కమిటీ స్పష్టం చేసిందన్నారు.

తాము జాతీయ హరిత ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, సంబంధిత మంత్రిత్వశాఖలు చేసిన విజ్ఞప్తుల ఫలితమే ఆ ప్రాజెక్టును యథాతథ స్థితిలో ఉంచాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఇంత జరిగినా ఏపీ సర్కారు పరోక్ష మార్గాల ద్వారా ప్రా జెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ఈ పరిణామాలను చూ స్తూ ఊరుకోబోదని ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెల్లడించి అక్రమ నీటి తరలింపును అడ్డుకుంటామన్నారు. 

భద్రాచలానికి పొంచి ఉన్న ముప్పు..

రాయలసీమకు గోదావరి వరద నీటి మళ్లింపు అంటూ జరిగితే భద్రాచలం వంటి ప్రాశస్త్యం ఉన్న దేవాలయం ప్రమాదపుటంచున పడే ప్రమాదం ఉందని మంత్రి ఆందో ళన వ్యక్తం చేశారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్ సర్కారు ఉదాసీనత వల్లే ఏపీ ఇలాంటి చర్యలకు పాల్పడిందన్నారు.

రాష్ర్ట వ్యాప్తం గా చేపట్టిన ప్రాజెక్టుల పూడికతీత పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. నీటిపారుదల శాఖ రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు అదిత్యానాథ్ దాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఈఎన్‌సీ లు అనిల్‌కుమార్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, సీఈ శ్రీనివాస్‌రెడ్డి  సమీక్షలో పాల్గొన్నారు.