calender_icon.png 5 November, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీలో మదర్సాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

05-11-2024 01:02:27 PM

న్యూఢిల్లీ: యూపీలో మదర్సాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2004 ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అంజుమ్ కడారి దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో సహా ఎనిమిది పిటిషన్లపై ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి ( సీజేఐ) డీ.వై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మదర్సాలలో విద్యా ప్రమాణాలు ఆధునిక విద్యా అంచనాలకు అనుగుణంగా ఉండేలా నిర్ధారించడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక పాత్రను నొక్కిచెప్పింది. విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించాలని రాష్ట్రాన్ని కోరింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ చట్టాన్ని ఉల్లంఘించినందున మదర్సాలు ఉన్నత విద్య డిగ్రీలు మంజూరు చేయలేవని సుప్రీం కోర్టు ప్రకటించింది.