calender_icon.png 4 April, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తుల వెల్లడికి అంగీకరించిన సుప్రీం జడ్జిలు

03-04-2025 11:30:32 PM

స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలిస్తున్న న్యాయమూర్తులు..

త్వరలోనే సుప్రీం వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం..

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఇటీవల పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బహిర్గతం అయిన విషయం తెలిసిందే. దీంతో జడ్జిల ఆస్తుల గురించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వారు కూడా తమ ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తుల వివరాల బహిర్గతానికి సుప్రీం జడ్జిలు అంగీకారం తెలిపారు. కాగా ఇప్పటికే కొంత మంది సుప్రీం జడ్జిలు స్వచ్ఛందంగా తమ ఆస్తుల వివరాలను సమర్పించారు. దీంతో మరికొద్ది రోజుల్లో సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో జడ్జిల ఆస్తులకు సంబంధించిన వివరాలు కనిపించనున్నాయి. సుప్రీం కోర్టులో ప్రస్తుతం సంజీవ్ ఖన్నాతో కలిపి 30 మంది జడ్జిలు ఉన్నారు.