న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు మరణించిన ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం సుమోటోగా విచారణ చేపట్టి కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల జీవితాలతో కోచింగ్ సెంటర్లు ఆడుకుంటున్నాయని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఘటన ఓ కనువిప్పు అన్న సుప్రీం కోర్టు భద్రతా ప్రమాణాలు పాటించే కోచింగ్ సంస్థలకు అనుమతివ్వాలని ఆదేశించింది.