calender_icon.png 19 October, 2024 | 7:56 AM

సుప్రీం విచారణలు ఇకపై లైవ్

19-10-2024 02:06:19 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: సుప్రీంకోర్టు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై అత్యున్నత న్యాయస్థానం లో జరిగే అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన యాప్‌ను పరీక్షించిన యంత్రాంగం లోటుపాట్లను సవరించి త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. సుప్రీం లైవ్‌పై 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాలేదు. 2023లో శివసేనలో థాకరే, షిండే వర్గాల మధ్య పంచాయితీపై విచారణను యూట్యూబ్ ద్వారా లైవ్‌ను అందించారు. ఇప్పటివరకు కొన్ని కీలక కేసులను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేశారు.