calender_icon.png 26 October, 2024 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ ప్రశ్న పత్రం లీకైన మాట వాస్తవం : సుప్రీంకోర్టు

08-07-2024 03:58:02 PM

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం సంచలనం సృష్టించింది. నీట్ పరీక్ష ఫలితాలపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యాలు చేసింది. నీట్ ప్రశ్న పత్రం లీకైన మాట వాస్తవమన్న ధర్మాసనం లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని స్పష్టం చేసింది. పేపర్ లీక్ తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉన్నట్లు ఎన్టీయే కోర్టుకు వెల్లడించింది.

దీంతో లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా?, కనీసం పేపర్ లీక్ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో గుర్తించే ప్రక్రియ అయిన జరుగుతోందా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడిన అంశమన్న కోర్టు జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని పేర్కొంది. లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారని, ఎంతమంది విద్యార్థుల ఫలితాలు విత్ హెల్డ్ లో పెట్టారని సుప్రీంకోర్టు అడిగింది.