16-04-2025 12:28:20 PM
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల(Kancha Gachibowli land)పై బుధవారం నాడు సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. చెట్లు కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బి.ఆర్. గవాయ్(Bhushan Ramkrishna Gavai) కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అనుమతులు తీసుకునే జామాయిల్ తరహా చెట్లు, పొదలు తొలగించామని ప్రభుత్వం తరుఫు న్యాయవాది తెలిపారు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్, అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహారిస్తే చూస్తూ ఊరుకోమని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.
రూ. 10 వేల కోట్లకు భూములను మార్టిగేజ్ చేసినట్లు నివేదిక పేర్కొందన్న అమికస్ క్యూరీ.. భూములను మార్టిగేజ్ చేసారో.. అమ్ముకున్నారో మాకు అనవసరమని జస్టిస్ గవాయ్ తెలిపారు. చెట్లు కొట్టే ముందు అనుమతి ఉందా.. లేదా అనేదే ముఖ్యమని జస్టిస్ గవాయ్(Justice Gavai) పేర్కొన్నారు. 2004 నుంచి కంచ గచ్చిబౌలిలో జరిగిన ప్రాజెక్టు వివరాలను ప్రభుత్వం తరుఫు లాయర్ సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పారు. వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలనే అంశంపై దృష్టి సారించాలని జస్టిస్ గవాయ్ సూచించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.
కంచ గచ్చిబౌలి భూములను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(Central Pollution Control Board)కి అప్పగించాలని అమికస్ క్యూరీ ఆదేశించారు. దెబ్బతిన్న పర్యావరణాన్ని ఎలా పునరుద్దరిస్తారనేదే తమకు ముఖ్యమని గవాయ్ స్పష్టం చేశారు. పర్యావరణ పునరుద్ధరణ మినహా.. మిగిలిన వ్యవహారాలతో తమకు సబంధం లేదని జస్టిస్ గవాయ్ వెల్లడించారు. పర్యావరణ పునరుద్ధరణ ఎలా చేస్తారు.. ఎంత కాలంలో చేస్తారో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో స్పష్టం చేప్పాలని రాష్ట్రాప్రభుత్వానికి సుప్రీ కోర్టు ఆదేశించింది. 4 వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. కంచ గచ్చిబౌలి భూములపై తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. మే 15 వరకు కంచ గచ్చిబౌలి భూముల్లో స్టేటస్ కో(Status Co) కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.