calender_icon.png 25 September, 2024 | 9:58 AM

పంజాబ్ ఎన్‌ఆర్‌ఐ కోటాపై సుప్రీంకోర్టు ఫైర్

25-09-2024 04:07:29 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం ఇటీవల పంజాబ్ ప్రభుత్వం తీసుకువ చ్చిన ఎన్‌ఆర్‌ఐ కోటా నిబంధనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్‌ఆర్‌ఐ కోటా విస్తరించాలన్న నిర్ణయాన్ని కొట్టివేసిన హైకోర్టు తీర్పుపై పంజా బ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీ ల్ చేసింది.

ఈ అప్పీల్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం ఇటీవల పంజాబ్ ప్రభు త్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎన్‌ఆర్‌ఐ బంధువులు కూడా ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొంది.

ఈ నిబంధన దుర్వినియోగానికి దారితీయవ చ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. ‘ఇది కేవలం ఎన్‌ఆర్‌ఐ వ్యాపార మోసం తప్ప మరొకటి కాదు. ’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.