న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దీపావళి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా నిషేధంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఢిల్లీలో బాణాసంచా నిషేధం కొనసాగించలేదని వార్తలొస్తున్నాయని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు సోమవారం బాణాసంచా నిషేధం చాలా వరకు అమలు చేయలేదని పేర్కొంది. బాణాసంచా నిషేధంపై ప్రభుత్వం ఎందుకు కఠినంగాలేదు..? అని ప్రశ్నించింది. ఢిల్లీలో బాణాసంచా నిషేధాన్ని ఉల్లంఘించినవారి స్థలాలను సీలింగ్ చేయడం వంటి కొన్ని కఠినమైన చర్యలు అవసరం" అని ఎస్సీ వెల్లడించింది. కానీ బాణసంచా నిషేధం అమలుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు కమిషనర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే పంటవ్యర్థాల దహనంపై అఫిడవిట్ దాఖలు చేయాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది