calender_icon.png 3 April, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం ఆగ్రహం

02-04-2025 01:26:04 AM

  1. ఈ తీరు షాక్‌కు గురిచేసిందన్న ఉన్నత న్యాయస్థానం
  2. ఆశ్రయం పొందే హక్కు కూడా వారికి లేదా?
  3. చిన్నారి ఆర్తనాదాలు కలచివేశాయన్న న్యాయమూర్తి
  4. 2021 నాటి కూల్చివేతల ఘటనపై తీర్పు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2021లో ప్రభు త్వం జరిపిన బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021లో ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆరు ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేసింది. ఇందులో ఓ లాయర్, ఓ ప్రొఫెసర్ కూడా బాధితులుగా ఉన్నారు.

ప్రొఫెసర్, లాయర్, మరో ముగ్గురు బాధి తులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా కానీ కోర్టు వారి పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో వారు సుప్రీం తలుపు తట్టగా.. అనేక వాదనల తర్వాత మంగళవారం సుప్రీం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వా నికి మొట్టికాయలు వేస్తూ తుది తీర్పు ను వెలువరించింది.

కేసును విచారించిన జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బుల్డోజర్ కూల్చివేతల వల్ల ఆశ్రయం కోల్పోయిన బాధితులకు ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆరు వారాల్లో ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ‘ఈ తీరు తమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ కూల్చివేతలు పూర్తిగా అమానవీయం, చట్టవి రుద్ధం. ఎవరైనా ఆశ్రయం పొందేందుకు భారత రాజ్యాంగం హక్కు కల్పించిందని, రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్‌లో అది స్పష్టంగా ఉందని డెవలప్‌మెంట్ అథారిటీ గుర్తుంచు కోవాలి. మీరు కూల్చివేసిన ఇంటి బయట ఓ చిన్నారి ఏడుస్తున్న వీడి యో హృదయవిదారకంగా ఉంది. ఈ వీడియో చూసి ప్రజలు అనేక మంది కలత చెందారు.

ఈ తరహా కూల్చివేతలను వెంటనే ఆపేయాలి. కూల్చివే తలు ఫ్యాషన్ కాకూడదు’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక యూపీ ప్రభుత్వ బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం ఇప్పటికే అనేక సార్లు తీవ్రంగా స్పందించినా ప్రభుత్వం మా త్రం తన పంథాను వీడట్లేదు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అభిమ న్యు భండారి వాదనలు వినిపించారు. 

ఆరు వారాల్లో చెల్లించండి

బాధితులకు ఆరువారాల్లోగా పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశించింది. ‘మేము ఈ చర్యలన్నింటినీ చట్టవిరుద్ధమైనవిగా నమోదు చేశాం. బాధితులకు పరిహారం ఇవ్వడం వల్లే వారికి న్యాయం చేసినట్లవుతుంది. ఆరు వారాల్లోపు పిటిషనర్లు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వండి’ అని కోర్టు ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది.