న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా బఫర్ జోన్ లలో చెరువులు కుంటలు తదితర ఎఫ్ టీఎల్ జోన్లలో నిర్మాణాలను బుల్‌డోజర్ తో కూల్చివేసే కార్యక్రమాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన విషయం తెలిసిందే. కూల్చి వేతలను ఆపివేయాలంటూ భారత అత్యున్నత న్యాయ స్థానం మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు రోడ్లు, రైల్వేస్టేషన్లు తదితర పబ్లిక్ ఆస్తుల పక్కన భవనాలను మాత్రమే కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు తన ఆదేశాలలో స్పష్టం చేసింది.
నిర్మాణాలను కూల్చివేసే కార్యక్రమాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న భవనా కూల్చివేతలు ఎప్పుడు ఎలా చేపట్టాలో నిర్దేశిస్తూ అక్టోబర్ 1 లోగా మార్గ దర్శకాలను జారీ చేయనున్నట్లు భారత సుప్రీం కోర్టు పేర్కొన్నది. ముగ్గురు న్యాయ మూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ జస్టిస్ హరికిషన్ రాయ్, సుధాన్శూ ధూలియా, ఎస్వీ ఎన్ భాటియాలు ప్రభుత్వం చేపట్టిన చర్యలను బుల్‌డోజర్ న్యాయం గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశ మైన భారత్ లో సుప్రీం కోర్టు న్యాయమే అత్యుత్తమమని సుప్రీం కోర్టు తన డైరెక్టవ్స్ ద్వారా మాత్రమే మార్గదర్శకాలను తయారు చేసే అధికారం ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కోర్టు ఆద్వర్యంలోని మార్గదర్శకాలు దేశమంతా వర్తించేలా చట్టాలు, రాజ్యంగ స్పూర్తికి అనుగుణంగా ఉంటాయన్నారు.
గుజరాత్‌లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్ కుటుంబానికి చెందిన ఇంటిని బుల్డోజ్ చేస్తానని మునిసిపల్ అధికారి బెదిరింపులకు పాల్పడినట్లు పిటిషన్ తెలిపింది. మునిసిపల్ అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఖేడా జిల్లాలోని కత్‌లాల్ గ్రామంలో భూమి యజమాని తరఫున పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. తమ పిటిషనర్ కుటుంబానికి చెందిన మూడు తరాలు రెండు దశాబ్దాలుగా ఈ ఇళ్లలో నివాసం ఉంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తమ జీవనాధారానికి కేంద్రబిందువైన ఇంటిపై కూల్చివేత విషయంలో పిటిషనర్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు.