04-04-2025 01:43:30 PM
మండల సోషల్ మీడియా కన్వీనర్ ఊరడి యాదగిరి యాదవ్
చేగుంట, విజయక్రాంతి: హెచ్ సీయూ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు(Supreme Court of India) స్టే ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామని, దుందుడుగు చర్యలకు పాల్పడుతున్న రేవంత్(CM Revanth Sarkar) సర్కారుకు చెంపపెట్టు లాంటిదిఅని పర్యావరాన్ని కాపాడటంలో ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు న్యాయస్థానం మార్గదర్శకంగా ఉండటం శుభ పరిణామం. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి, చట్టానికి అతీతంగా పనిచేస్తుందని, ఇప్పటి కైనా ప్రభుత్వం తమ మొండి వైఖరి వీడి,అక్కడ జీవ వైవిధ్యం కాపాడాలిని హెచ్ సీయూ భూములు(Hyderabad Central University land) కాపాడుకునేందుకు ఎంతగానో పోరాటం చేసిన విద్యార్థులకు, అధ్యాపకులకు, పర్యావరణ పరిరక్షణ సంఘాలకు, తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.