న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌కు వైద్యం అందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని రైతు సంఘాల నాయకులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నాయకుల తీరును తప్పుబట్టింది. నిజంగా దల్లేవాల్ క్షేమం కోరుకునే వారైతే అలా అడ్డుకోరనే విషయాన్ని తెలియజేయాలని పంజామ్ చీఫ్ సెక్రటీరీకి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు.
దల్లేవాల్‌కు చికిత్స అందించాలన్న ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్ సీఎస్, డీజీపీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. దల్లేవాల్‌కు చికిత్స అందేలా చూడాలని తాము పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించామని.. అయితే వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం చేస్తున్నా ప్రయత్నాలపై తాము సంతృప్తిగా లేమని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
అమసరమైతే ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వానిక కేంద్రం మద్దతు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది. కాగా పంటలకు ఎమ్మెస్పీ ధర కల్పించడం తదితర డిమాండ్లతో నవంబర్ 26 నుంచి ఖనౌరీ శిబిరం వద్ద దల్లేవాల్ దీక్ష చేస్తున్నారు.